కాంగ్రెస్ నెల్లికుదురు మండల కార్యదర్శిగా సంధ్యారాణి..
ప్రజావాణి,నెల్లికుదురు:మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా చీకటి సంధ్యారాణి నియమితులయ్యారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి ఎమ్మెల్యే డా. మురళి నాయక్ సమక్షంలో ప్రకటించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంధ్యారాణిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు ఆకాంక్షించారు.తనకు ఈ బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి చీకటి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు పదవి అప్పగించిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి కి,మాజీ మండల అధక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్,మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్ల తో పాటు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

