అన్యాయాన్ని ఎదిరించి పేదలకు అండగా నిలిచిన పండుగ సాయన్న
ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 22(ప్రజావాణి):పండుగ సాయన్న తన కాలంలో సామాజిక అసమానతలను, దోపిడీని ఎదిరించి పేదలకు అండగా నిలిచిన యోధుడు అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పండుగ సాయన్న 174వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పండుగ సాయన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న దానధర్మాలు చేసిన ప్రజానాయకుడిగా, ప్రజలను దోచుకుంటున్న దొరలు, దేశ్ముఖ్ల ఆస్తులను పేదలకు పంచిన ఉన్నత వ్యక్తిగా పేరు పొందారని పేర్కొన్నారు. అలాగే అన్యాయాన్ని ప్రశ్నించి, అణగారిన వర్గాలకు అండగా నిలిచారని తెలిపారు.
అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, జిల్లా అధికారులు అందరూ పాల్గొని, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహారావు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు నీలం గట్టయ్య, ఉపాధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి సదానందం, ఫిషరీస్ ప్రమోటర్ రాజు, సీనియర్ పాత్రికేయులు కన్నా పరశురాములు, కల్నల్ భిక్షపతి, జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశం, ఆర్య కుల క్షత్రియ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కేజికేఎస్ జిల్లా కార్యదర్శి వెంకట మల్లయ్య, టికేవిఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అభినాష్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, సభ్యులు, జిల్లా అధికారులు, ఐడీఓసీ సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

