వెంకటేశ్వరపల్లి యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
రాయపర్తి, అక్టోబర్ 21 (ప్రజావాణి):
రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో వెంకటేశ్వరపల్లి యూత్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ అధ్యక్షుడిగా మంద రాజు, ఉపాధ్యక్షుడిగా కొనుకటి రామ్మూర్తి, కోశాధికారిగా ఏసిరెడ్డి అనిల్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు యువత ఐక్యతకు, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వెంకటేశ్వరపల్లి యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
RELATED ARTICLES

