ఘాట్ కేసర్, అక్టోబర్ 21 (ప్రజావాణి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘రేవంతన్న టీం’ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం శ్రీకాంత్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

