*డబిల్ పూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు*
*కౌన్సిలర్లు విగ్నేశ్వర్ రెడ్డి, హరీఫ్, ముత్యాల గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు*
: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కౌన్సిలర్లు విగ్నేశ్వర్ రెడ్డి, హరీఫ్, ముత్యాల గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు డబిల్ పూర్ గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం డబిల్ పూర్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీజే వాయిద్యాల మధ్య బతుకమ్మలను ఉంచి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు
బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కౌన్సిలర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారుల వెంట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, రాకపోకలకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను తీసుకొని చెరువు వద్దకు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను నూతనకల్ గ్రామ ప్రజలు ఐకమత్యంతో జరుపుకున్నారు. మహిళలతో పాటు పురుషులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు. పూల పండుగైన బతుకమ్మ వేడుకలు గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపాయి. కౌన్సిలర్లు విగ్నేశ్వర్ రెడ్డి, హరీఫ్, ముత్యాల గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో
కౌన్సిలర్లు విగ్నేశ్వర్ రెడ్డి, హరీఫ్, ముత్యాల గౌడ్, నాయకులు డబిల్ పూర్ మాజీ సర్పంచ్ దుడ్డు సంజీవరావు, మాజీ వార్డ్ సభ్యుడు నర్సింగ్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సల్ల వెంకటేష్ యాదవ్, భవాని వెంకటేష్, సీనియర్ నాయకుడు శ్రీరామ్ రెడ్డి, నాయకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు గ్రామ మహిళలు, పురుషులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

