📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవర్షాలు సమృద్ధిగా కురవాలని మర్రిపల్లిగూడలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

వర్షాలు సమృద్ధిగా కురవాలని మర్రిపల్లిగూడలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ మర్రిపల్లిగూడలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక మస్జిద్‌-ఏ-బిలాల్ ఆవరణలో అల్లాహ్‌ను వేడుకుంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, చెరువులు, కుంటలు నీటితో నిండాలని, రైతులకు మేలు జరిగి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడాలని, సమస్త జీవరాశులకు నీరు అందాలని, పర్యావరణ సమతుల్యత కాపాడబడాలని అల్లాహ్‌ను వేడుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఘట్‌కేసర్ ఖాజీ హాఫీజ్ అబ్దుల్ సమద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్ 6వ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ ఖయ్యుమ్, మస్జిద్ ఇమామ్ మహమ్మద్ జునేద్, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ షానూర్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ షానూర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అన్వర్, మహమ్మద్ రఫియాద్దీన్, సలీం, ఫయాజుద్దీన్, రియాజుద్దీన్‌తో పాటు మర్రిపల్లిగూడ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.