వర్షాలు సమృద్ధిగా కురవాలని మర్రిపల్లిగూడలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ మర్రిపల్లిగూడలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక మస్జిద్-ఏ-బిలాల్ ఆవరణలో అల్లాహ్ను వేడుకుంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, చెరువులు, కుంటలు నీటితో నిండాలని, రైతులకు మేలు జరిగి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడాలని, సమస్త జీవరాశులకు నీరు అందాలని, పర్యావరణ సమతుల్యత కాపాడబడాలని అల్లాహ్ను వేడుకున్నారు. ప్రజలందరూ...