📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriసద్దుల బతుకమ్మ వేళ మహిళల సౌకర్యార్థం ప్రత్యేక లైట్ల ఏర్పాటు....ప్రజల అవసరాలే ప్రాధాన్యత.. ప్రజా సేవే...

సద్దుల బతుకమ్మ వేళ మహిళల సౌకర్యార్థం ప్రత్యేక లైట్ల ఏర్పాటు….ప్రజల అవసరాలే ప్రాధాన్యత.. ప్రజా సేవే లక్ష్యం: కేశపావుల వినోద్ కుమార్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోచారం డివిజన్ పరిధిలో ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేయించారు. ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడుకునే ప్రదేశాల్లో తగిన వెలుతురు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి లైట్లను ఏర్పాటు చేయించారు. అలాగే డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ప్రజల సౌకర్యార్థం లైట్లను ఏర్పాటు చేయించి పండుగ వేళ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా కేశపావుల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా సహకరించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మహిళలకు, ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.