సద్దుల బతుకమ్మ వేళ మహిళల సౌకర్యార్థం ప్రత్యేక లైట్ల ఏర్పాటు….ప్రజల అవసరాలే ప్రాధాన్యత.. ప్రజా సేవే లక్ష్యం: కేశపావుల వినోద్ కుమార్

ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోచారం డివిజన్ పరిధిలో ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేయించారు. ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడుకునే ప్రదేశాల్లో తగిన వెలుతురు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి లైట్లను ఏర్పాటు చేయించారు. అలాగే డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ప్రజల సౌకర్యార్థం లైట్లను ఏర్పాటు చేయించి పండుగ వేళ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేశపావుల...