📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదుర్గామాత సేవలో ఈర్ల రాజు ముదిరాజ్

దుర్గామాత సేవలో ఈర్ల రాజు ముదిరాజ్

📰 Generate e-Paper Clip

దుర్గామాత సేవలో ఈర్ల రాజు ముదిరాజ్!

భక్తి మనకు బలం.. సేవ సమాజానికి ఆదర్శం
సనాతన ధర్మ పరిరక్షణ
ప్రతి ఒక్కరి బాధ్యత

పలు కాలనీల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు

అమీన్‌పూర్‌, అక్టోబర్ 17(ప్రజావాణి):భక్తి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుందని, సేవ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ అన్నారు. అమీన్‌పూర్‌, బీరంగూడ డివిజన్ల పరిధిలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ మాలధారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కిష్టారెడ్డిపేటలో దొంతు పెంటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, దుర్గానగర్ కాలనీలో సముద్రాల రాకేష్, ఆయన మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పటేల్‌గూడ సూర్యోదయ కాలనీలో రఘు, ఆయన మిత్రులు, పటేల్‌గూడలో రొయ్యల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను సందర్శించారు. హరివిల్లు కాలనీలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మన సంస్కృతిని భావితరాలకు అందించాలన్నారు. దుర్గామాత ఆరాధన స్త్రీశక్తికి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు మానవత్వానికి

సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు సముద్రాల రాకేష్ గుప్తా, ఈర్ల భాస్కర్ ముదిరాజ్, రొయ్యల రాజు ముదిరాజ్, కమ్మరి భాస్కర్ చారి, భైరవ్, నాగరాజ్, శ్రీనివాస్, కల్వకుంట్ల రాకేష్ గుప్తా, విష్ణువర్ధన్ రెడ్డి, మహేష్, దేవేందర్, రఘు తదితరులు పాల్గొన్నారు. భవానీ మాలధారులు, బీజేపీ కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.