📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..

తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..

📰 Generate e-Paper Clip

తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..

సర్పంచ్ శకుంతల బాలు సార్ ఆధ్వరంలో ఘనంగా బతుకమ్మ పండుగ

పాఠశాల ఆవరణంలో ముస్తాబు చేసిన సర్పంచ్ శకుంతల బాలుసార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 17

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని సర్పంచ్ విద్య బలరం అన్నారు. మహిళా సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం రోజున కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లోని మహ్మదాబాద్ గ్రామం లో పాఠశాల ఆవరణంలో బతుకమ్మ కోసం ముస్తాబు చేసిన రకరకాల లైట్లతో, రకరకాల పూలతో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మల చుట్టూ చేరి ఆడి పాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ శకుంతల బాలు సార్ మాట్లాడుతూ …..పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని పేర్కొన్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, మహిళలందరూ ఐకమత్యంతో పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
మహిళలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.