ధర్మారావుపేటలో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం
ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాల ఏర్పాటు
దండేపల్లి, అక్టోబర్ 17 (ప్రజావాణి):
దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యకు గ్రామ సర్పంచ్ కొత్త ధర్మయ్య పరిష్కారం చూపించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. దీంతో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సర్పంచ్ కొత్త ధర్మయ్యను గ్రామస్తులు అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దాసరి ప్రేమ్ చందు, ఉప సర్పంచ్ నక్క చంద్రమౌళి, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త సతీష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

