📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

📰 Generate e-Paper Clip

*తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ*

*మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి*

*మంత్రి క్యాంప్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు*

*నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి అన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్) లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మల చుట్టూ చేరి ఆడి పాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి మాట్లాడుతూ పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, మహిళలందరూ ఐకమత్యంతో పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
మహిళలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఎగ్గడి సుజాత, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య నరసింహ, సూరెడ్డి సరస్వతి, స్వాతి కరుణాకర్ రెడ్డి, సదా లక్ష్మీ, స్వరూప, రుద్ర, పద్మ, నారాయణమ్మ, వెంకటమ్మ, సరోజ, నిర్మల, పెరిక లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.