ధనలక్ష్మి దేవి అవతారంలో దుర్గా మాతను దర్శించుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్
నాగర్ కర్నూలు జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం,:
అక్టోబర్ 17 /ప్రజావాణి ప్రతినిధి.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈరోజు ధనలక్ష్మి దేవి రూపంలో దుర్గ మాతను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ లు దర్శించుకున్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతించి తీర్థప్రసాదాలను అందించి సన్మానించారు. కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గోలి శ్రీనివాసరెడ్డి కోరారు, అలాగే ముందుగా నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు, కార్యక్రమంలో ఆలయ ఫౌండరీ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు, కల్మిచర్ల గోపాల్ మరియు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.

