పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తిప్పారపు తుకారాం ఏకగ్రీవంగా ఎన్నిక
జమ్మికుంట అక్టోబర్ 16 (ప్రజావాణి)
పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా మోట్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో స్కూల్ లో గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తిప్పారపు తుకారాం ను ఎన్నుకున్నారు. అక్టోబర్ 15 16 తేదీలలో నల్లగొండ లోని జీఎం గార్డెన్స్ లో జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర ఆరవ కవితలు సమావేశాలలో జరిగిన ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు సుంకరి బిక్షం గౌడ్ ప్రధాన కార్యదర్శి బట్టపురపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా తుకారాం ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. మోట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న తుకారం ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల గ్రామస్తులు పాఠశాల సిబ్బంది గ్రామస్తులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుకారం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన సంఘం నాయకులకు రుణపడి ఉంటానని ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పి ఆర్ టి యు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పి ఆర్ టి యు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండు కృష్ణా ప్రధాన కార్యదర్శి కాసుగడ్డ శ్రీను రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

