📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆడబిడ్డల చదువుకే పెద్దపీట

ఆడబిడ్డల చదువుకే పెద్దపీట

📰 Generate e-Paper Clip

ఆడబిడ్డల చదువుకే పెద్దపీట.. దేవరుప్పుల కేజీబీవీ కి రూ.56 లక్షల వరం – ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి):ఆడబిడ్డల చదువే తమ ప్రభుత్వ లక్ష్యమని, బాలికల విద్యాభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకొస్తానని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.

దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ )లో రూ.56 లక్షల వ్యయంతో చేపట్టనున్న మొదటి అంతస్తు మిగులు పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేసి, పనులను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేజీబీవీ పాఠశాలలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, కనీసం మరుగుదొడ్లు, తరగతి గదులు కూడా లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

దేవరుప్పుల కేజీబీవీ లో విద్యార్థినుల సంఖ్య 300కి పైగా ఉందని, స్థలాభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించి రూ.56 లక్షల నిధులను మంజూరు చేయించానని అన్నారు. ఈ నిధులతో అదనపు తరగతి గదులు, డార్మిటరీ, మౌలిక వసతులు నిర్మించనున్నట్లు తెలిపారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం ఉండొద్దని, సిమెంట్, స్టీల్ విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దవేరా అనిల్ కుమార్, సర్పంచ్ పెద్ది కృష్ణ మూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ, తహసీల్దార్, ఏంఈఓ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దవెర అనిల్, సర్పంచ్ పెద్ది కృష్ణ మూర్తి, నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.