📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబతుకమ్మ నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన గ్రామపంచాయతీ పాలకవర్గం

బతుకమ్మ నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన గ్రామపంచాయతీ పాలకవర్గం

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన గ్రామపంచాయతీ పాలకవర్గం

లోతైన ప్రాంతాల్లోకి వెళ్లొద్దు.. గ్రామపంచాయతీ పాలకవర్గం సూచన

బెజ్జంకి,అక్టోబర్ 16 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో బతుకమ్మ ఆడే స్థలాన్ని గ్రామపంచాయతీ పాలకవర్గం పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
బతుకమ్మ నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనాన్ని వాగు ఆవరణలో సురక్షితంగా నిర్వహించుకోవాలని, వాగులోని లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉపసర్పంచ్ దుగ్యాని లావణ్య -మోహన్, వార్డు సభ్యులు పంతంగి వెంకటేష్, కొంకటి సంపత్, కొంకటి సురేష్, గుగ్గిళ్ల లావణ్య, ర్యాకం అనిత, పంచాయతీ కార్యదర్శి వంశీ, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, కరాబర్ అశోక్, పోతూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.