బతుకమ్మ నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన గ్రామపంచాయతీ పాలకవర్గం
బతుకమ్మ నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన గ్రామపంచాయతీ పాలకవర్గం లోతైన ప్రాంతాల్లోకి వెళ్లొద్దు.. గ్రామపంచాయతీ పాలకవర్గం సూచన బెజ్జంకి,అక్టోబర్ 16 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో బతుకమ్మ ఆడే స్థలాన్ని గ్రామపంచాయతీ పాలకవర్గం పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనాన్ని వాగు ఆవరణలో సురక్షితంగా నిర్వహించుకోవాలని, వాగులోని లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో...