📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ50 ఏళ్లు నిండిన మేదరి కులస్తులకు మేదరి పెన్షన్ ఇవ్వాలి

50 ఏళ్లు నిండిన మేదరి కులస్తులకు మేదరి పెన్షన్ ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

*50 ఏళ్లు నిండిన మేదరి కులస్తులకు మేదరి పెన్షన్ ఇవ్వాలి: ప్రభుత్వానికి విజ్ఞప్తి*

*రాయికల్, అక్టోబర్ 15 (ప్రజావాణి):*

50 సంవత్సరాలు నిండిన మహేంద్ర మేదరి కులస్తులకు మేదరి పెన్షన్ మంజూరు చేసి వెనుకబడిన తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెదురును నమ్ముకుని జీవనం సాగిస్తున్న మేదరి కులస్తుల జీవితాలు 50 ఏళ్లకే శారీరకంగా క్షీణించిపోతున్నాయని, తెల్లవారుజామునే అడవులకు వెళ్లి బరువైన వెదురు బొంగులను మోసుకురావడం, రోజంతా కూర్చొని గంపలు, బుట్టలు అల్లడం వల్ల నడుము, కళ్లు, చేతివేళ్లు దెబ్బతిని 50 ఏళ్లు దాటేసరికి కులవృత్తి చేసే స్తోమత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల దాడి, వెదురు కొరత, అటవీ చట్టాలతో ఉపాధి కూడా కరువై రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. సగటు ఆయుస్సు కూడా తగ్గడంతో 60 ఏళ్ల వరకు వేచి ఉంటే పెన్షన్ పొందేవారే ఉండరని, అందువల్ల గీత, చేనేత కార్మికుల తరహాలో మేదరి కులస్తులకు కూడా 50 ఏళ్లకే నెలకు రూ. 4000 పెన్షన్ మంజూరు చేయాలని, మండల స్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి మేదరి కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదివరకు ఈ విషయంపై ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించి మూడు వారాలైనా అధికారుల నుండి ఎలాంటి వివరణ రాలేదని, ఇకనైనా మేదరి కులస్తుల దీన పరిస్థితిని గుర్తించి మేదరి కులస్తులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.