📄 ePaper
Epaper 2
Friday, October 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదసరాబతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

దసరాబతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

దసరాబతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

* బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు

* అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట అక్టోబర్ 15 (ప్రజావాణి)

దసరాబతుకమ్మ పండుగలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారుఇటీవల హుజురాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎదురైన ఇబ్బందులు బతుకమ్మ పండుగ రోజున పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంటహుజురాబాద్ పట్టణాల మున్సిపల్ కమిషనర్లుకౌన్సిలర్లతో సమీక్ష సమావేశంనిర్వహించారుఅదేవిధంగా వీణవంక జమ్మికుంట ఇల్లంతకుంట కమలాపూర్ మండలాల్లోనూ బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆర్డీవోకి ఫోన్ ద్వారా మాట్లాడి తెలియజేశారు. అన్ని మండలాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారుబతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం పారిశుద్ధ్య నిర్వహణ వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో మహిళలు సౌకర్యవంతంగా వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారుపండుగ సమయంలో ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు వెంటనే స్పందించేలా అందుబాటులో ఉండాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేసూచించారుమహిళలకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలతో పాటు వీణవంక ఇల్లంతకుంటకమలాపూర్ మండలాల్లోనూదసరాబతుకమ్మ ఉత్సవాలు ఘనంగాప్రశాంతంగా జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.