📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక బతుకమ్మ వేడుకలు

సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక బతుకమ్మ వేడుకలు

కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి అశోక్

ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

మేడ్చల్: ఎంపీడీఓ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. అశోక్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మహిళా కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కార్మికులు నిత్యజీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి హక్కుల సాధన కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల ఐక్యతే ప్రధాన బలమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగస్వామి, మేడ్చల్ మండల కార్యదర్శి ఎంపీ నరేష్, మండల నాయకులు నర్సింగ్ రావు, వసంత, ప్రేమలత, భాగ్యమ్మ, సునీత, చెంది ప్రవీణ్, పద్మ, రజిని తదితరులతో పాటు మహిళా కార్మికులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.