సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక బతుకమ్మ వేడుకలు

సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక బతుకమ్మ వేడుకలు కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి అశోక్ ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు మేడ్చల్: ఎంపీడీఓ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. అశోక్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు....