📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ గా రంగినేని స్పందన, రాజీవ్

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ గా రంగినేని స్పందన, రాజీవ్

📰 Generate e-Paper Clip

*నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ గా రంగినేని స్పందన, రాజీవ్*
నేరేడుచర్ల, పాలకవీడు రెండు మండలాలకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నేరేడుచర్ల మార్కెట్ కార్యాలయంలో నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌, వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు 17 మంది తో కూడిన కూడిన పాలకవర్గం లో డైరెక్టర్లు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్‌రెడ్డి సభ అధ్యక్ష వహించారు. రెండు మండలాల్లోని వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మార్కెట్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది పూల బొకేలు, గజమాలతో ఘన సన్మానం ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించారు. రాజీవ్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైర్‌పర్సన్ స్పందన రాజీవ్‌కు గజమాల వేసి ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.