వంగపల్లి యువకుడు హైదరాబాద్ లో దారుణ హత్య
మద్దూరు అక్టోబర్15, ప్రజా వాణి,
మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన బోడీకి ప్రేమ్ (18) హైదరాబాద్ పట్టణంలోని తుక్కుగూడ ప్రాంతంలోని నందిగామ మండలంలోని అత్తిరెడ్డి గూడలో దారుణ హత్య కు గురైనట్లు గ్రామస్థులు విలేఖర్లకు తెలిపారు.హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా మృతుని స్వగ్రామం మద్దూరు మండలం వంగపల్లి గ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
