📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసింగరేణి కార్మిక గర్జనకు భారీగా తరలిన బిఆర్ఎస్ దండు

సింగరేణి కార్మిక గర్జనకు భారీగా తరలిన బిఆర్ఎస్ దండు

📰 Generate e-Paper Clip

సింగరేణి కార్మిక గర్జనకు భారీగా తరలిన బిఆర్ఎస్ దండు…

భూపాలపల్లి, అక్టోబర్ 14 మన ప్రజావాణి : నల్లబంగారంగా పేరుగాంచిన సింగరేణి సంపదను కొల్లగొడుతూ, కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన గోదావరిఖనిలో నిర్వహిస్తున్న సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి టిబిజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,యువతతో కలిసి సుమారు 500 మందితో గోదావరిఖనికి బయలుదేరారు.
సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్మిక గర్జన కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.