📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశ కార్యక్రమం

ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశ కార్యక్రమం.

ప్రజా సమస్యలపై చర్చించిన అధికారులు,ప్రజాప్రతినిధులు

ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి

పీడీ సిద్ధార్థనాయక్

ఎంపీడీవో విజయ్ కుమార్

ఎల్కతుర్తి పీహెచ్‌సీ డాక్టర్ రాజశేఖర్

మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్

ఎల్కతుర్తి సొసైటీ బ్యాంకు చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి,పీడీ సిద్ధార్థనాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై చర్చించారు.
ఈ సమావేశంలో ఎల్కతుర్తి పీహెచ్‌సీ వైద్యుడు రాజశేఖర్ మాట్లాడుతూ,ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనదారుల భద్రత కోసం స్పష్టమైన తెల్లటి రోడ్డు గుర్తులు ఏర్పాటు చేయాలని కోరారు.రోడ్డు గుర్తులు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎల్కతుర్తిలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు వ్యాక్సిన్లు అందించే కార్యక్రమానికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సహకరించడం లేదని సమావేశంలో ప్రస్తావించారు.విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు,గ్రామ సర్పంచులు,సహకార సంఘం బ్యాంకు అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి,ఎంపీడీవో విజయ్ కుమార్,మండల వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్,ఏపిఎం కవిత ఇతర అధికారులు పాల్గొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.