📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన

మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన—

480 ఫ్లాట్ల నిర్మాణం రూ.43.20 కోట్లతో ప్రాజెక్టు’

జవహర్ నగర్ అక్టోబర్ 14, (ప్రజావాణి ప్రతినిధి):

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్:

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, పోచారం గ్రామం సర్వే నంబర్ 10/Pలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 480 ఫ్లాట్లు నిర్మించనుండగా, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.43.20 కోట్లుగా ఉంది.

అనంతరం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను మంత్రులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నర్సింహా యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు , సీనియర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.