📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకమలాపూర్ మండలంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు

కమలాపూర్ మండలంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు

📰 Generate e-Paper Clip

కమలాపూర్ మండలంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు

ప్రజావాణి అక్టోబర్ 13 కమలాపూర్ మండల్ బెల్టు షాపులపై ఎక్సైజ్ శాఖ పేరుకే నామమాత్రపు దాడులు

గ్రామాల్లో జోరుగా సాగుతున్న అక్రమ మద్యం

పలు ప్రాంతాల్లో తనిఖీలు మద్యం స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించని అధికారులు
కేవలం తనిఖీలకే పరిమితం కానీ వివరాలెక్కడ
ఎన్ని కేసులు నమోదు చేసినారు వెల్లడించాల్సిన అధికారులు అసలు ఎన్ని షాపులపై దాడులు జరిగింది ఎంత మద్యం పట్టుబడింది అనే వివరాలు వెల్లడించలేకపోతున్న ఎక్సైజ్ శాఖ
వివరాలు అడుగుతే నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు
వివరాల వెల్లడికి వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తన
మండల పరిధిలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల వ్యవహారం పై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సాధించినట్లు సమాచారం కానీ గ్రామాల్లో అనాధికారికంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి
మండలాల్లో కొన్ని గ్రామాల్లో అధికారిక అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా రాత్రివేళలో కూడా మద్యం విక్రయాలు సాగుతున్నాయి కానీ ఎక్సైజ్ అధికారులు నామమాత్రపు రైడ్స్ చేసి వివరాలు వెల్లడించలేకపోతున్నారు
బెల్ట్ షాపుల వెనుక ఉన్న అసలు వ్యవస్థాపై కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సాధించాలని పలువురు ఆరోపిస్తున్నారు
ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం కానీ వివరాలు వెల్లడించలేకపోవడంలో మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే దాడులు ఏ గ్రామాల్లో జరిగాయి ఎంత మద్యం పట్టుబడింది ఎవరిపై కేసులు నమోదయ్యాయి వివరాలు వెల్లడించలేకపోవడంపై స్పష్టత రావాల్సి ఉంది

ఇకనైనా ఎక్సైజ్ శాఖ కేవలం దాడులకే పరిమితం కాకుండా మండలంలో బెల్ట్ షాపుల కల్తీ మద్యం అక్రమ మద్యం నియంత్రణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు

వివరాలు వెల్లడించాల్సిన అధికారుల స్పష్టత ఏమైంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.