ఎంజియు పిజి & ఎంబీఏ రెండవ సెమిస్టర్ ఫలితాల విడుదల
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన పీజీ & ఎంబీఏ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మంగళవారం సి ఓ ఈ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. పీజీ రెండవ సెమిస్టర్ లో మొత్తం 962 విద్యార్థుల కు గాను 66.13% ఎంబీఏ లో 243 మంది విద్యార్థులకు గాను 66.67 % ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.

