📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకంబంలో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవ అవగాహన సదస్సు

కంబంలో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవ అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

కంబంలో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవ అవగాహన సదస్సు

ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా అక్టోబర్ 13

కంబం: ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం (గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే) సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక కంబంలో బిలీవర్స్ ఈస్ట్రన్ చర్చ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫాదర్ జేమ్స్ పాల్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అద్దంకి నుంచి విచ్చేసిన ఫాదర్ కాంతారావు మాట్లాడుతూ.. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చేతుల అపరిశుభ్రత కారణంగా నులిపురుగుల సమస్యలు, కడుపునొప్పి, విరేచనాలు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, విరేచనాల వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వివరించారు.

బేస్తవారపేట ప్రాంతంలోని ప్రతి చర్చిలో, మిషన్ సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పాస్టర్లకు, ఉమెన్స్ ఫెలోషిప్ సభ్యులకు చేతులు శుభ్రంగా కడుక్కునే సరైన పద్ధతులపై శిక్షణ ఇచ్చి, ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ కాంతారావు, ఫాదర్ జేమ్స్ పాల్, ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య, పలువురు పాస్టర్లు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం పాల్గొన్న వారందరికీ చేతులు శుభ్రపరిచే విధానాన్ని ప్రదర్శించి, హ్యాండ్‌వాష్ పంపిణీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.