రఘునాథపల్లి ఎస్ఐగా ఎం. భరత్ బాధ్యతల స్వీకరణ
జనగామ జిల్లా ప్రతినిధి/ జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా ఎం. భరత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన నరేష్ యాదవ్ వేలేరుకు బదిలీ కాగా, జనగామ పీఎస్ నుండి భరత్ ఇక్కడికి బదిలీపై వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ భరత్ మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలని, చట్టాన్ని ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

