📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ , పెద్దలు జానా రెడ్డి , నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి మరియు నల్లగొండ జిల్లా శాసనసభ్యుల (ఎమ్మెల్యేలు) విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 12

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ , పెద్దలు జానా రెడ్డి , నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి మరియు నల్లగొండ జిల్లా శాసనసభ్యుల (ఎమ్మెల్యేలు) విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.
​ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడారు. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఎండుతున్న పంటలను కాపాడటంతో పాటు మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఎన్ఎస్పి (NSP) అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
​మంత్రి ఉత్తర్వుల మేరకు NSP అధికారులు ఈరోజు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో ఆయకట్టు రైతులు, ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
​ఈ నీటి విడుదల కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి , DCCB మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి , 5వ వార్డు ఇన్చార్జి కేతావత్ జవహర్ నాయక్ , ఓబీసీ సెల్ జిల్లా నాయకులు ప్రవీణ్, మిర్యాలగూడ మండల ఆత్మ (ATMA) చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.