📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఎన్ఐఎన్ కాలనీలో వైభవంగా దుర్గామాత ప్రతిష్ఠాపన

ఎన్ఐఎన్ కాలనీలో వైభవంగా దుర్గామాత ప్రతిష్ఠాపన

📰 Generate e-Paper Clip

ఎన్ఐఎన్ కాలనీలో వైభవంగా దుర్గామాత ప్రతిష్ఠాప

 

మేడిపల్లి, అక్టోబర్ 11 (ప్రజావాణి):దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మేడిపల్లి పరిధిలోని ఎన్ఐఎన్ కాలనీలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మూడో సంవత్సరం దుర్గామాత ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, ప్రత్యేక పూజల నడుమ అమ్మవారిని ప్రతిష్ఠించడంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హోమాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.