📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభక్తిశ్రద్ధలతో.. దేవీశరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం

భక్తిశ్రద్ధలతో.. దేవీశరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో..
దేవీశరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం..
ప్రజావాణి,ఇనుగుర్తి: శ్రీదుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో శరన్నవరాత్రి ఉత్సవాల లో భాగంగా ఆదివారం అమ్మవారిని అత్యంత వైభవోపేతంగా అలంకరించి బ్రాహ్మనోత్తముల వేదమంత్రోచ్ఛరణల మధ్య దుర్గామాతకు జై అంటూ భక్తుల జయ జయధ్వానాల మధ్య అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు.

ఇనుగుర్తిలో..

మండల కేంద్రం ఇనుగుర్తి చారిత్రక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణం పెద్ద వినాయకుని మండపం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో వద్దిరాజు కిషన్,ఎంపీ రవిచంద్ర సోదరుల సౌజన్యంతో ఘనంగా ప్రారంభించారు.ఆలయ అర్చకులు తిరునహరి కృష్ణమాచార్యుల వేదమంత్రోచరణల మధ్య పూజా క్రతవులు నిర్వహించగా వద్దిరాజు బ్రదర్స్ లలో వెంకన్న ఉమామహేశ్వరి పూజల్లో పాల్గొన్నారు. ఎస్సై పి.నరేష్, వద్దిరాజు వెంకన్న (ఎక్సైజ్) పద్మ, వద్దిరాజు వెంకన్న రజిత దంపతులతో పాటు పలువురు గ్రామస్తులు దేవి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పులకించి పరవశించి పోయారు.

బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం..

దేవి శరన్నత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు లోకపావని దుర్గామాత భక్తులకు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారి దివ్య సుందర రూపాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రుడయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.