భక్తిశ్రద్ధలతో.. దేవీశరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
భక్తిశ్రద్ధలతో.. దేవీశరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం.. ప్రజావాణి,ఇనుగుర్తి: శ్రీదుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో శరన్నవరాత్రి ఉత్సవాల లో భాగంగా ఆదివారం అమ్మవారిని అత్యంత వైభవోపేతంగా అలంకరించి బ్రాహ్మనోత్తముల వేదమంత్రోచ్ఛరణల మధ్య దుర్గామాతకు జై అంటూ భక్తుల జయ జయధ్వానాల మధ్య అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ఇనుగుర్తిలో.. మండల కేంద్రం ఇనుగుర్తి చారిత్రక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణం పెద్ద వినాయకుని మండపం వద్ద దేవి...