మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తరలింపు
చిలుకూరు అక్టోబర్ 11(పజావాణి): సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.సిలిండర్ పేలిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అనంతరం గాయపడిన గుంజ శివ (25), ఆయన తల్లి గుంజ వెంకమ్మ (46)లను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం కోదాడ నుంచి సూర్యాపేటకు తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

