📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriముద్దగొని భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, జామెట్రీ కిట్ల పంపిణీ

ముద్దగొని భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, జామెట్రీ కిట్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

పిల్లాయిపల్లి, అక్టోబర్ 9 (ప్రజావాణి): యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్‌)లో శుక్రవారం విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, జామెట్రీ కిట్లను పంపిణీ చేశారు.

యూత్ ఫర్ సేవా సంస్థ సహకారంతో ఏపీ–తెలంగాణ రీజినల్ మేనేజర్ మెంగా అరవింద్, ముద్దగొని భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ప్రోత్సహించి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో విద్యా సామగ్రిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, ఇతర ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు అందించిన సహకారాన్ని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.