ఘట్‌కేసర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రి రాజేష్ నేతృత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వినోద్ కుమార్ కృషి చేస్తున్నారు. కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు అవసరమైన స్థలాలను శుభ్రం చేయించడం, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వాటర్ లైన్ల ఏర్పాటుకు కృషి చేయడం, కాలనీల్లో వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రజావసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతంగా జరిగేలా చొరవ తీసుకుంటున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేస్తున్న వినోద్ కుమార్ సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.


