ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేశపావుల వినోద్ కుమార్
ఘట్‌కేసర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రి రాజేష్ నేతృత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వినోద్ కుమార్ కృషి చేస్తున్నారు. కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో...