ఇసుక ట్రాక్టర్ ఢీ మహిళకు తీవ్ర గాయాలు
ముదిగొండ అక్టోబర్ 7 ప్రజావాణి ప్రతినిధి
_మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన బొడ్డు జ్యోతి అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బుధవారం తన మనవరాలిని స్కూల్ బస్సు ఎక్కించిన అనంతరం రోడ్డు దాటుతుండగా మల్కాపురం వైపు నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఆమెను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది._

