📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

📰 Generate e-Paper Clip

*వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్*

*బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం…పలు కేసులు ఛేదించిన జైపూర్ పోలీసులు*

ప్రజావాణి జైపూర్ అక్టోబర్6

వరుసగా ఇళ్లకు తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరుగుతుందని జైపూర్ ఎస్ ఐ భూమేష్ ఒక ప్రకటన లో తెలిపారు.

*నిందితుడిని వివరాలు*

సబ్బాని లక్ష్మీనారాయణ @ చింటూ (27), కాంట్రాక్టర్ బస్తీ, బెల్లంపల్లి

*వివరాల్లోకి వెళితే..*

నిందితుడు తన స్నేహితుడు *మహ్మద్ మగ్దూం* తో కలిసి సెప్టెంబర్ 28న ఇందారం గ్రామంలో రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు అంగీకరించాడు. ఈ ఘటనలో దొంగిలించిన నగదు, ఆభరణాలను ఇద్దరూ పంచుకున్నట్లు తెలిపాడు.

అదేవిధంగా నిందితుడు బెల్లంపల్లి రైల్వే రాడగంబల బస్తీలో జనవరి 16న, గాంధీనగర్‌లో జూలై 9న, ఇందారం గ్రామంలో సెప్టెంబర్ 24న ఇళ్లకు తాళాలు పగులగొట్టి నగదు, వెండి వస్తువులు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తదితర వస్తువులు దొంగిలించినట్లు విచారణలో వెల్లడించాడు.

నిందితుడి వద్ద నుంచి సుమారు 2 తులాల వెండి కాళ్ల పట్టీలు, రూ.3,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో నిందితుడి సహచరుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తాళాలు వేసి ఇళ్లను వదిలి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ ఐ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.