📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాగిల్లాపూర్ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా

గాగిల్లాపూర్ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా

📰 Generate e-Paper Clip

గాగిల్లాపూర్ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా… లద్నూరులొ వేళ పాలలేని విద్యుత్ కోతలు

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యతో ఎండుతున్న పంట పొలాలు

మద్దూరు అక్టోబర్6, ప్రజా వాణి,

మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి పంట చేతికందే సమయంలో విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు పెట్టడంతో నీరు సరిగా అందక పంటలు సరైన బలంగా లేక వరి చేను ఎండిపోయి నేల వాలి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా మండలంలోని లద్నూరు గ్రామంలో వేల పాల లేని విద్యుత్తు కోతలు విధించడంతో ఇటు రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ప్రజలు అన్నం వండుకొని తినే సమయంలో రెండు గంటలు కరెంట్ పోవడంతో సిబ్బందిపై గ్రామస్థులు మండి పడ్డారు. తక్షణమే పంట కోత సమయంలో మెరుగైన విద్యుత్ పంట పొలాలకు అందించి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని అందుకు బాధ్యులు విద్యుత్ అధికారులే అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.