📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహాస్టల్ లో ఎలుకల బెడద.. విద్యార్థినికి కాటు

హాస్టల్ లో ఎలుకల బెడద.. విద్యార్థినికి కాటు

📰 Generate e-Paper Clip

*హాస్టల్ లో ఎలుకల బెడద.. విద్యార్థినికి కాటు*

*పాఠశాల చుట్టుప్రక్కల దుర్భరమైన వాసన!.. పారిశుద్ధానికి తిలోదకాలు*

గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 05. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. హాస్టల్‌లో నిద్రిస్తున్న ఒక విద్యార్థినిని ఎలుక కొరకడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురుకులంలో పరిశుభ్రత కొరవడటం, నిర్వహణా లోపాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. *అధికారుల ఆకస్మిక తనిఖీ* ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక గూడూరు తహశీల్దార్ నిమ్మతోట నాగభవాని తక్షణమే వసతి గృహాన్ని, కళాశాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థినుల తో నేరుగా సంభాషించి, అక్కడ పాటిస్తున్న పరిశుభ్రత, రోజువారీ అందించే భోజనం యొక్క నాణ్యత, వసతులపై ఆరా తీశారు. అధికారుల విచారణలో విద్యార్థినులు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. *ఘటనను నీరుగార్చేందుకు కుట్ర?* ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వ్యాపించి, మండల వ్యాప్తంగా వైరల్ కావడంతో కొందరు వ్యక్తులు ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *మండల పరిధిలోని ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు రంగప్రవేశం చేసి, “ఇది చిన్న ఎలుక కాటు వార్తే కదా, మేనేజ్ చేయండి”* అంటూ అధికారులను, సిబ్బందిని ఒత్తిడికి గురిచేసే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల ప్రాణాలతో కూడుకున్న విషయాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. *ప్రిన్సిపాల్‌పై చర్యలకు డిమాండ్* నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థినుల భద్రతను, ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన కళాశాల ప్రిన్సిపాల్‌పై తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గురుకుల యంత్రాంగానిదేనని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.