📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల...

శ్రీ సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ల విడుదల

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ లక్షెట్టిపేట అక్టోబర్ 4 ::-

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. శ్రీ సాయి గణేష్ భక్తమండలి గోదావరి రోడ్డు లక్షెట్టిపేట ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల పోస్టర్లను సీఐ రమణ మూర్తి ఎస్సై గోపతి సురేష్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, వేద పండితులు, కాలనీ సభ్యులు కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఐ రమణ మూర్తి మాట్లాడుతూ, శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, భజనలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో ఎస్సై గోపతి సురేష్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, వేద పండితులు, కాలనీ సభ్యులు, భక్తమండలి నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.