శ్రీ సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ల విడుదల
ప్రజావాణి న్యూస్ లక్షెట్టిపేట అక్టోబర్ 4 ::- దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. శ్రీ సాయి గణేష్ భక్తమండలి గోదావరి రోడ్డు లక్షెట్టిపేట ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల పోస్టర్లను సీఐ రమణ మూర్తి ఎస్సై గోపతి సురేష్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, వేద పండితులు, కాలనీ సభ్యులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ రమణ మూర్తి మాట్లాడుతూ, శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే...