📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamజిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మిక తనిఖీ

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ

వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో పరిశీలన

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందేలా వైద్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రి సమయంలో ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
అదనపు కలెక్టర్‌తో కలిసి ఆసుపత్రి ఆవరణలోని వివిధ విభాగాలను కలియతిరుగుతూ పరిశీలించిన కలెక్టర్, రాత్రి వేళ ఆసుపత్రిలో వైద్య సేవల పరిస్థితి, ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మందుల పంపిణీ, ఔషధాల నిల్వలు, రోగులకు కల్పిస్తున్న మౌళిక సదుపాయాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులకు, వైద్యులకు కలెక్టర్ దివాకర టిఎస్ పలు సూచనలు చేశారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. రోగుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చోట అదనపు ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, మందుల కోసం రోగులు క్యూ లైన్లు లో ఉండకుండా ఔషధాల పంపిణీ కౌంటర్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.

ప్రతి రోగికి అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ఔషధాల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అత్యవసర మందులకు కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం, సకాలంలో వైద్య సేవలు అందించాలని. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరినీ గౌరవంగా, బాధ్యతతో పరిగణిస్తూ అవసరమైన వైద్య సేవలను వేగంగా అందించాలని సూచించారు.
ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి విశ్వాసంతో వైద్య సేవలు పొందేలా ఆసుపత్రుల్లో సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరచాలని కలెక్టర్ తెలిపారు. రోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలోని మౌలిక వసతులు, ఇతర ప్రజా సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
రాత్రి సమయంలో కూడా వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కలెక్టర్ తనిఖీల సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, ఆర్ఎంఓ, పంచాయతీరాజ్ ఈఈ మహేష్ బాబు, సంబంధిత శాఖల అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.