📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriచనిపోయిన గొర్రెల రైతు కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ 50 వేల ఆర్థిక సహాయం

చనిపోయిన గొర్రెల రైతు కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ 50 వేల ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

*కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచిన బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05*

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండ మడుగు సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 600 గొర్రెలు మృతి చెందడంతో బాధిత రైతు కుటుంబం తీవ్రంగా నష్ట పోయింది. గొర్రెలే జీవనాధారంగా ఉన్న కిష్టయ్య కుటుంబం ఒక్క సారిగా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఆదు కునేందుకు బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత సోమవారం రోజు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఆమె.. వారికి ధైర్యం కల్పించారు.
బీర్ల ఫౌండేషన్ తరఫున అందించిన ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి కొంతమేర ఉపశమనం కలిగించ నుంది. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకుఎల్లప్పుడూ అండగా ఉంటామని బీర్ల ఫౌండేషన్ చైర్ బీర్ల అనిత తెలిపారు. ఇదిలా ఉండగా , ప్రమాదంలో జీవనాధారమైన గొర్రెలను కోల్పోయిన బాధిత రైతు కిష్టయ్యకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఇప్పటికే అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.