📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

బెజ్జంకి మండలం నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలి

బెజ్జంకి, అక్టోబర్ 5 (ప్రజావాణి)

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించనున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి బెజ్జంకి మండల శాఖ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జి చింతకింది పర్శరాములు,ఎంఎస్ పి మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుంచి కళాశాల, డిగ్రీ, డిప్లొమా, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు అధిక సంఖ్యలో సదస్సుకు తరలిరావాలని కోరారు.
ప్రతి గ్రామం నుంచి కనీసం ఇద్దరు విద్యార్థులు తప్పక హాజరయ్యేలా నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సదస్సుకు హాజరయ్యే విద్యార్థులు తెల్ల అంగీ, నల్ల ప్యాంట్‌తో కూడిన డ్రెస్ కోడ్ పాటించాలని, సమయపాలనతో పాటు క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. సదస్సును విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్బెజ్జంకి మండల అధ్యక్షులు జేరుపోతుల మధు, సీనియర్ నాయకులు మంకాల బాలయ్య, తాడిచెట్టు భూమయ్య, మంకాల నాగేష్, రొడ్డ ఐలయ్య, ఎంఎస్ పి బేగంపేట గ్రామశాఖ అధ్యక్షులు బెజ్జంకి పోచయ్య, కనగండ్ల మైసయ్య, బోనగిరి అర్జున్, యువ నాయకులు ఉప్పులేటి శ్రీనివాస్, మంకాల సురేష్, బోనగిరి శివశంకర్, రామంచ శ్రీనివాస్, కనుకయ్య, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.