📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonగంజాయిని పట్టుకున్న జనగామ పోలీసులు

గంజాయిని పట్టుకున్న జనగామ పోలీసులు

📰 Generate e-Paper Clip

*గంజాయిని పట్టుకున్న జనగామ పోలీసులు*

*- ఐదుగురు యువకుల అరెస్ట్*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 04 (ప్రజావాణి) : జనగామ పోలీసులు పట్టణ శివార్లలో శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను జనగామ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం జనగామ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజు సాయంత్రం సమయంలో జనగామ ఎస్ఐ ఎం.భరత్, కానిస్టేబుల్స్ కరుణాకర్, కృష్ణ, శ్రీకాంత్, శివప్రసాద్, రమేష్, సాగర్, రాజేష్, శ్రీనులతో కలిసి బతుకమ్మ కుంట క్రాస్ రోడ్డు, సూర్యాపేట రోడ్డు నందు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు బైకుల పై ఐదుగురు వ్యక్తులు అనుమానాస్ప దంగా తిరుగుతూ వచ్చి పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారని వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించగా వారు భయపడి తడబడుతూ తమ వద్ద గంజాయి ఉందని దానిని సరఫరా చేస్తున్నామని అంగీకరించినట్లు సీఐ సత్యనారాయణ రెడ్డి వివరించారు. ఇట్టబోయిన ఉదయ్ కుమార్, నివాసం కుందారం గ్రామం (ప్రస్తుతం హైదరాబాద్), పోతుగంటి సుధీర్, నివాసం పెద్దమడూరు గ్రామం, పంజాల శివకుమార్, నివాసం హైదరాబాద్, నందనబోయిన సందీప్, నివాసం కుందారం గ్రామం, తాండ్ర అభిషేక్, నివాసం శామీర్ పేట గ్రామాలకు చెందిన నిందితులుగా గుర్తించామని ప్రకటించారు. నిందితుల వద్ద నుండి 245 గ్రాముల గంజాయి, రెండు పల్సర్ బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్బంగా పోలీసులను జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి అభినందించి మాట్లాడుతూ గంజాయి రహిత జనగామగా తీర్చిది ద్దేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తామని, యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని యువతకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.