గంజాయిని పట్టుకున్న జనగామ పోలీసులు
*గంజాయిని పట్టుకున్న జనగామ పోలీసులు* *- ఐదుగురు యువకుల అరెస్ట్* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 04 (ప్రజావాణి) : జనగామ పోలీసులు పట్టణ శివార్లలో శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను జనగామ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం జనగామ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజు సాయంత్రం సమయంలో జనగామ ఎస్ఐ ఎం.భరత్, కానిస్టేబుల్స్ కరుణాకర్, కృష్ణ, శ్రీకాంత్, శివప్రసాద్, రమేష్,...